నలుపైతేనేమి మా రూపం, సెలయేళ్ల కన్న మాలో సొంపులెక్కువని వంపులు తిరిగిన దారులు
వినీలాకాశపు నీలం విలీనం చేసుకుని గర్వాతిశయమున హొయలొలుకుతున్న సరస్సులు
నిప్పుల కొప్పులే ఐనా పచ్చని పచ్చిక బైళ్ళు కప్పుకొని ప్రశాంతత ప్రదర్శిస్తున్న పర్వతాలు
పొరలుగా పేరుకొని ధర విరుపుల్ని సౌమ్యంగా శాంతపరుస్తున్న తెల్లటి మంచు తెరలు
ఇంద్రధనస్సుని మ్రింగి అందాలు ఆరబోసి భగ్గు భగ్గున పొగలు గ్రక్కుతున్న నీటిబుగ్గలు
కాలాలన్నీ తనలో కలిపేసి జంతు నిలయమైన ఈ ప్రకృతి హంగులో ప్రతీ వర్ణం సువర్ణమే

If you didn’t understand what I said above, do an image search on Yellowstone.

 

Leave a Reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)