తనువు బరువు లెక్కించని పాదములకి కీళ్ళ నొప్పులు కలిగించెను పరువు బరువులు
ప్రేమాభిమానాలు వెదజల్లే హృదయములకు గుండెపోట్లు కలిగించెను పౌరుషప్రతీకారాలు
ప్రకృతి హంగులు ఆస్వాదించే నయనములకి కలకలు కలిగించెను మనిషిలోని రంగులు
మేధ సంపదలు కొలువుండే మెదడులకి మధు మేహం కలిగించెను అహంభావములు
తెల్లకాగితములు పోలిఉండే మనసులకు వ్యధల చెదలు కలిగించెను పచ్చకాగితములు
గణిత సూక్తులకు అతీతమైన బంధములకు ముసలితనం కలిగించెను వయో వ్యాకరణములు

 

Leave a Reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)