అభి “మాన” ధనులమైన మనం….
నమ్మకమైన మాటలే శ్వాసగా బ్రతుకుతాం, మాట మీద నిలపడతాం
డబ్బు జబ్బునైనా ఎదిరించి ఉరుకుతాం, మాట మీద నిలపడతాం
సొంత కాళ్ళ మీద నిలబడటమైనా మరుస్తాం, మాట మీద నిలపడతాం

కానీ కాల “మాన” మార్పును పాటించే మనం….
తలకెక్కనంత వరకూ మన-పర భేద భావం, మాట మీద నిలపడతాం
స్వలాభం ఉన్నంతవరకూ ప్రాణాలైనా పెడతాం, మాట మీద నిలపడతాం
మాటలెన్ని జవదాటినా చెప్తూనే ఉంటాం, “మాట మీద నిలపడతాం”

 

Leave a Reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)