మనుమల మనమలకై ముందు చూపుతో కూడు కూడబెట్టే చీమలు
పక్క ఇంటి వాసాల లెక్కలు కట్టి ఆక్రమించాలని చూసే సర్ప రాజములు
చీకటిని వంటికి పులుముకుని మధుర రాగసుధలాలాపించే కోయిలలు
తమ కొమ్ముల వాడి చూసుకోక కయ్యాలకు కాలు దువ్వే పోట్ల గిత్తలు
పరులని తోయాలని గుంటలు తవ్వుతూ పొంచి ఉండే తెలివైన తోడేళ్ళు
వెలగ డొల్లలు పంచుతూ ప్రపంచాన్ని భుజాలపై లాగుతున్న దిగ్గజాలు