ఒంటరిగా వచ్చి దాహం తీర్చలేని చినుకు, వర్షంగా నేలరాలి పంటలు సైతం పండించగలదు
ఒంటరిగా సూర్యరశ్మికి అడ్డుపడలేని మేఘం, గుంపుగా కూడి ప్రళయం సైతం సృష్టించగలదు
ఒంటరిగా బాట చూపలేని దీపపు కాంతి, వందలుగా వెలిగి చిమ్మ చీకటిని సైతం పారద్రోలగలదు
ఒంటరిగా కుట్టడం కూడా చేతకాని చలి చీమ, దండుగా దాడి చేసి సర్పాన్ని సైతం చంపగలదు
ఒంటరిగా చిక్కి పారిపోలేని పావురం, జట్టుగా కూడి బోయవాడి వలని సైతం ఎగరేసుకుపోగలదు
ఏకునిగా స్వసమస్యల నెదిరించలేని వాడు, సంఘంగా పోరాడి ఏకంగా స్వరాజ్యం సాధించగలడు

 

Leave a Reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)