మేడం మేడం మేడం మేడం!, కొద్దిగా లేటుగా వచ్చాను, క్లాసులోకి రానివ్వండి ప్లీజ్!!
రేయ్ రేయ్ రేయ్ రేయ్!, ప్రోజెక్ట్ చేయడం రాదు, నువ్వు చేసిపెట్టరా ప్లీజ్!!
బాబ్బాబ్బాబ్బాబు!, ఫీజు టైముకి కట్టలేదు, ఎగ్జాం రాయనివ్వండి ప్లీజ్!!
ఉస్ ఉస్ ఇస్ ఇస్!, నాకా ఆన్సర్ తెలీదు, కాస్త జరిగి చూపించరా ప్లీజ్!!
సర్ సర్ సర్ సర్!, రెండే మార్కులు తక్కువ, ఈసారికి పాస్ చెయ్యండి ప్లీజ్!!
బుజ్జీ! కన్నా! చిన్నా! నాన్నా!, విద్యని అర్ధించరా…, విద్య కోసం కాదురా… ప్లీజ్!!!