కలిసెను ఇరువురి కరములు, విరిసెను వారిద్దరి మోములు, అనగనగా ఒక శుభదినము
ఆనందం పంచియిచ్చెను కౌగిలులు, బంధం బిగించెను కరములు, అనగనగా ఒక నందనందనము
వేయుట అధికారమనెను కరములు, మోయుట భాగ్యమనెను భుజములు, అనగనగా ఒక స్నేహపర్వము
వెన్నును అదిర్చెను భయములు, దన్నుగా నిలిచెను కరములు, అనగనగా ఒక ఉదారతనము
సాయం చేయవచ్చెను కరములు, కాయం బరువనెను పాదములు, అనగనగా ఒక నిస్సహాయతరుణము
కంచికి చేరెను కథలు, కనులు తుడిచెను చేతులు, అనగనగా ఒక ఊహించనిక్షణము

 

Leave a Reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)


Switch to our mobile site