తెలివికి తాళం వేసి దాహం తీర్చే నీటి కోసం ఎండమావుల వైపు పరుగెడుతుంటాం
కర్షక కష్టం ఖాతరు చేయని వరుణుడి కోసం కరుణించమని నింగికేసి మొరపెడుతుంటాం
పాపమంటని పద్మం వంటి స్వచ్చమైన నాయకుడి కోసం పంకిలమంతా గాలిస్తుంటాం
ఎవరో వస్తారని ఏదో చేస్తారని రేపటి సూర్యుడి కోసం ప్రతి రోజూ కలలతో గడుపుతుంటాం
ఎన్నేళ్ళైనా ఎప్పుడొస్తుందో తెలియని రామరాజ్యం కోసం జీవితమంతా నిరీక్షిస్తుంటాం
వృధా ప్రయాసలని తెలిసీ ఆశలోనే ఆనందం కోసం వెతుకుతూ తృప్తి పడుతుంటాం

 

1 Response » to “ఆశతోనే తృప్తి పడుతుంటాం. అందుకే…”

  1. Harsha says:

    chala bagundi!!!

Leave a Reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)